ఎమ్మెల్సీ జకియా ఖానం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిలతో కలిసి వెళ్లి సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. సాధారణ మహిళగా ఉన్న తనకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతగా ఉంటానని ఎమ్మెల్సీ జకియా అన్నారు.
సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్సీ జకియా ఖానం
ఎమ్మెల్సీ జకియా ఖానం సీఎం జగన్కు కలిశారు. సాధారణ మహిళగా ఉన్న తనకు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతగా ఉంటానని అన్నారు. వైకాపా అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని అన్నారు.
తనకు రాజకీయ భవిష్యత్తు ప్రసాదించి... చట్ట సభల ద్వారా ప్రజా సమస్యల ప్రస్తావనకు తెచ్చే అవకాశం కల్పించటం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిలతో కలిసి పని చేస్తామన్నారు. విధాన సభలో మహిళల సమస్యలపై ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.
ఇదీ చదవండి:ఏపీ ప్రభుత్వం కెలికి కయ్యం పెట్టుకుంటుంది: తెలంగాణ సీఎం కేసీఆర్