వైకాపా నేతలు చెప్పగానే ప్రజలపై కేసులు నమోదు చేయడం మంచి పద్ధతి కాదని... తెదేపా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ హెచ్చరించారు. గుంటూరు జిల్లా కాకుమానులో తెదేపా కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎవరైనా తప్పులు చేస్తే... చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. అమాయకులపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టొద్దన్నారు. ఈ విషయాలపై పోలీసులు పునరాలోచించుకోవాలని సూచించారు. పోలీసుల ద్వారా పార్టీని పెంచుకోవాలని చూడటం దారుణమని పేర్కొన్నారు.
అమాయకులపై కేసులా... ఎమ్మెల్సీ డొక్కా ఆగ్రహం - కాకుమాను తెదేపా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవర ప్రసాద్
వైకాపా నేతలు చెప్పగానే అమాయకులపై కేసులు నమోదు చేయడం... మంచి పద్ధతి కాదని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ హితవు పలికారు. గుంటూరు జిల్లా కాకుమానులో జరిగిన తెదేపా కార్యకర్తల సమావేశంలో మాణిక్యవర ప్రసాద్ పాల్గొన్నారు.
![అమాయకులపై కేసులా... ఎమ్మెల్సీ డొక్కా ఆగ్రహం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4852247-1066-4852247-1571895806951.jpg)
కాకుమాను తెదేపా సమావేశంలో ఎమ్మెల్సీ డొక్కా