'మహాత్ముడా... మళ్లీ నువ్వు రావాలి' - గాంధీజీ మళ్లీ నువ్వే రావాలి
తెదేపా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ ఆధ్వర్యంలో గాంధీజీ 150వ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. మహాత్ముడి ఆశయాలకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
మహాత్మగాంధీ 150వ జయంతి సందర్భంగా.. గుంటూరు హిమని సెంటర్‌లో తెదేపా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ ఆధ్వర్యంలో... వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహాత్ముడి సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ పాటించి... ఆయన ఆశయసాధనకు పాటు పడాలి అని డొక్కా అన్నారు. గాంధీజీ సిద్దాంతాలను పాటిస్తే దేశంలో ఉన్న అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని చెప్పారు. జాతిపిత విగ్రహానికి పూల మాలలు వేసిన విద్యార్థులు... గాంధీజీ మళ్లీ నువ్వు రావాలి అంటూ నినాదాలు చేశారు. మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాసరావు, గాంధేయవాధులు, విద్యార్థులు పాల్గొన్నారు.