రాజకీయ నాయకుల ప్రలోభాలకు అమరావతి రైతుల లోనౌతున్నారని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. రైతులకు న్యాయం జరగాలని అని కోరుకునే వారిలో తాను మొదటి వాడిని అని, తనపై తెదేపా నేతలు ఇష్టానుసారంగా మాట్లాడం సరికాదన్నారు. గుంటూరు లక్ష్మీపురంలో జరిగిన మదర్ థెరిస్సా జయంతి కార్యక్రమంలో డొక్కా పాల్గొన్నారు.
అమరావతి రైతులకు న్యాయం చేస్తాం: డొక్కా - ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ వార్తలు
అమరావతి రైతులకు తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తామని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నాారు. గుంటూరు లక్ష్మీపురంలో జరిగిన మదర్ థెరిస్సా జయంతి కార్యక్రమంలో ఎమ్మెల్సీ పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్
అమరావతి... దళితుల సమస్య కాదని.. అక్కడ అన్నివర్గాల వారు ఉన్నారన్నారు. కొందరు కావాలనే దానిని దళితులు సమస్యగా చిత్రీకరిస్తున్నారని అన్నారు.. అమరావతి రైతులకు తప్పకుండా న్యాయం చేస్తామనన్నారు. తాను ఏ పార్టీలో ఉన్న ఒకేలా మాట్లాడతాని అన్నారు. ఇకనైనా రాజధాని రైతులు రాజకీయ నాయకులు మాటలను నమ్మవద్దని న్యాయమైన పోరాటం చేయాలన్నారు.
ఇవీ చదవండి:రాజధానిగా అమరావతివైపే ప్రజల మొగ్గు... వెబ్‌సైట్ పోలింగ్‌లో 93 శాతం మంది ఓటు