శాసనమండలిలో సీఆర్డీఏ రద్దు , పరిపాలన వికేంద్రకరణ బిల్లులను మళ్లీ అడ్డుకుంటామని తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న స్పష్టం చేశారు. అమరావతి కోసం ఎంతవరకైనా పోరాడుతామని తెలిపారు. జగన్ విశాఖ వస్తుంటే అక్కడ ప్రజలు భయపడిపోతున్నారన్నారు. సెలెక్ట్ కమిటీ ఏర్పాటు అంశం పెండింగ్లో ఉండగా... తిరిగి ఆ బిల్లులను మండలికి ఎలా పంపిస్తారని ప్రశ్నించారు.
ఆ బిల్లులను మండలిలో మరోసారి అడ్డుకుంటాం: బుద్దా వెంకన్న - budha venkanna latest news
అమరావతిని రాజధానిగా ప్రకటించే వరకు తమ పోరాటం ఆగదని తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. మండలిలో రాజధాని వికేంద్రీకరణ బిల్లును అడ్డుకుంటామని స్పష్టం చేశారు.
అమరావతి ప్రజల రాజధాని