Rally to cancel the bail of Anantha Babu: ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దు చేయాలంటూ గుంటూరులో టీడీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మదర్ థెరిస్సా కూడలి నుంచి లాడ్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వరకూ నిరసన ర్యాలీ చేపట్టారు. దళిత యువకుడు, డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసినట్లు అంగీకరించిన అనంతబాబుకు బెయిల్ ఎలా ఇస్తారని ఎస్సీ నేతలు ప్రశ్నించారు. అనంతబాబుకు బెయిల్ వచ్చేలా ప్రభుత్వం, పోలీసులు సహకారించారని వారు ఆరోపించారు. వెంటనే అనంతబాబు బెయిల్ రద్దు చేయాలని, అతన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దు చేయాలంటూ నిరసనలు - Guntur District Political News
Rally to cancel the bail of Anantha Babu: ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దు చేయాలంటూ గుంటూరులో టీడీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతబాబుకు బెయిల్ వచ్చేలా ప్రభుత్వం, పోలీసులు సహకారించారని వారు ఆరోపించారు.
ర్యాలీ