వరదల వల్ల నష్టపోయిన ప్రతి రైతుకు త్వరలో పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటామని శాసనసభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి తెలిపారు. తాడికొండ మండలం తాడికొండ గ్రామంలో ముంపునకు గురైన పంట పొలాలను పరిశీలించారు.
వరద ముంపు గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటన - MLA vundavalli sridevi visited flood villages news
గుంటూరు జిల్లా తాడికొండ మండలంలోని తాడికొండ గ్రామంలో ముంపుకు గురైన పంట పొలాలను ప్రభుత్వ అధికారులతో కలిసి నియోజకవర్గ శాసనసభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి పరిశీలించారు.
వరద ముంపు గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటన
వరదల వల్ల నష్టపోయిన అన్ని గ్రామాల్లో పంట నష్టం అంచనా వేసి రైతులకు వెంటనే పరిహారం అందేలా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. వర్షపు నీరు రోడ్ల మీద నిలువకుండా, ప్రజలు రోగాల బారిన పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని వైద్య అధికారులను, పారిశుద్ధ్య కార్మికులను ఆదేశించారు.
ఇవీ చూడండి: