గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం దిశగా సీఎం జగన్ పని చేస్తున్నారని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు. జగన్ పాదయాత్రకు మూడేళ్లయినా సందర్భంగా మేడికొండూరు మండలం పేరేచర్లలో వైకాపా నేతలు పాదయాత్రను చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే... ఎన్నికల్లో ఇచ్చిన నవరత్నాలను ప్రభుత్వం అమలు చేసిందని చెప్పారు. రైతు భరోసా, అమ్మఒడి, వైఎస్ఆర్ విద్యాదీవెన వంటి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. సీఎం జగన్ పాలనలో రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు.
గ్రామ స్వరాజ్యం దిశగా సీఎం జగన్ పాలన: ఎమ్మెల్యే శ్రీదేవి - three years for jagan padayatra celebrations news
గ్రామ స్వరాజ్యం దిశగా ముఖ్యమంత్రి జగన్ పాలన సాగుతోందని వైకాపా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు. వైకాపా పాలనలో రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని చెప్పారు.
mla vundavall sridevi