గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలంలోని ముంపు గ్రామాల్లో.. పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు పర్యటించారు. పులిచింతల జలాశయం వరద ప్రవాహం ధాటికి.. నీట మునిగిన పొలాలను పరిశీలించారు. పంట నష్టం వివరాలను రైతులతో మాట్లాడి తెలుసుకున్నారు. రెవిన్యూ, పోలీస్ శాఖ అధికారులతో సహాయక చర్యలపై సమీక్షించారు. పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం నుంచి సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని రైతులకు భరోసా ఇచ్చారు.
పులిచింతల ముంపు గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటన - bellamkonda
పులిచింతల జలాశయం వరద ఉధృతికి.. లోతట్టు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ఆ గ్రామాల్లో ఎమ్మెల్యే శంకరరావు పర్యటించారు.
MLA visits villages affected by floods at bellamkonda in guntur district