కొవిడ్ కేర్ సెంటర్‌లో రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని అన్నారు. సబ్‌కలెక్టర్ శ్రీవాస్ నుపూర్ అజయ్‌కుమార్, డీఎస్పీ విజయభాస్కర్‌లతో కలిసి పట్టణంలోని టిడ్కో గృహ సముదాయంలో ఏర్పాటు చేసిన కరోనా చికిత్స కేంద్రాన్ని పరిశీలించారు. కొవిడ్ బాధితులకు సకాలంలో వైద్యం అందేందుకు.. ప్రతి ఆస్పత్రితో పాటు ఆక్సిజన్ సరఫరా కేంద్రాలకు కూడా నోడల్ అధికారులను ప్రభుత్వం నియమించిందని చెప్పారు.
చిలకలూరిపేటలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలలకు ఆక్సిజన్ కొరత రాకుండా చేసేందుకు నోడల్ అధికారులతో చర్చించినట్లు ఎమ్మెల్యే చెప్పారు. రెమిడెసివర్ ఇంజక్షన్ల కొరత రాకుండా ఉండేలా డ్రగ్ ఇన్స్పెక్టర్లతో మాట్లాడినట్లు తెలిపారు. కరోనా రోగులకు ఇబ్బందులు రాకుండా చూడాలని.. అన్నీ ఆస్పత్రుల నోడల్ అధికారులను ఆదేశించారు. హాస్పిటల్స్‌లో కావాల్సిన వైద్య సామగ్రిని తెప్పించటంలో కీలకంగా వ్యవహరించాలని చెప్పారు.
సిలిండర్లు సేకరించండి: