గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం, బండారుపల్లి గ్రామం నుంచి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ప్రజాపాదయాత్ర ప్రారంభించనున్నారు. సీఎం జగన్ పాదయాత్ర ప్రారంభించి ఈనెల 6వ తేదీకి మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా "ప్రజలలో నాడు-ప్రజల కోసం నేడు" అనే కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఓ ఎస్సీ కాలనీ నుంచి పాదయాత్ర చేపట్టి... అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.
"ప్రజలలో నాడు-ప్రజల కోసం నేడు" - "ప్రజలలో నాడు-ప్రజల కోసం నేడు" కార్యక్రమం
ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తాడికొండ నియోజకవర్గం, బండారుపల్లి గ్రామం నుంచి ప్రజాపాదయాత్ర ప్రారంభించనున్నారు. "ప్రజలలో నాడు-ప్రజల కోసం నేడు" అనే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అలాగే గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే శంఖుస్థాపన చేయనున్నారు.
!["ప్రజలలో నాడు-ప్రజల కోసం నేడు" MLA Undavalli Sridevi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9449204-30-9449204-1604637806815.jpg)
జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే ఇచ్చిన హామీలను 90 శాతం అమలు చేశారన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చారని తెలిపారు. సీఎం జగన్ పరిపానలో ప్రజల వద్దకే పథకాలు అందుతున్నాయని తెలిపారు. పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందున్నారు. ఈ పాదయాత్రలో పార్టీ శ్రేణులతో పాటు, ప్రభుత్వంలో భాగస్వామమైన ప్రజలందరూ పాల్గొనాలని శ్రీదేవి తెలిపారు.
ఇదీ చదవండీ...కేబినెట్ నిర్ణయాలు: రూ. వెయ్యి కోట్లతో భూముల సమగ్ర రీ సర్వే