గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి సొంత పార్టీ నుంచి అసమ్మతి సెగ తగిలింది. ఎమ్మెల్యే లేకుండా.. తాటికొండ మండలంలో "గడపగడపకు మన ప్రభుత్వం" కార్యక్రమం నిర్వహించడానికి ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం సమావేశమైంది. స్థానిక నాయకులకు సమాచారం లేకుండా... పొన్నెకళ్లు గ్రామంలో ఎమ్మెల్యే గడపగడపకు కార్యక్రమాన్ని చేపట్టడం అసమ్మతికి దారి తీసింది.
ఎమ్మెల్యే శ్రీదేవికి.. అసమ్మతి సెగ! - ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వార్తలు
గుంటూరు జిల్లా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి.. సొంత పార్టీ నుంచి అసమ్మతి సెగ తగిలింది. ఎమ్మెల్యే లేకుండానే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించటానికి నేతలు సమావేశమయ్యారు. ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడతో వెళ్తున్నారని ఆరోపించారు.
ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడతో వెళ్తున్నారని తాడికొండ నాయకులు ఆరోపించారు. రాజకీయ బ్రోకర్లను పక్కన పెట్టుకొని.. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అవినీతికి పాల్పడుతున్నారంటూ విమర్శలు గుప్పించారు. అక్రమ మైనింగ్, ఉద్యోగుల బదిలీల్లో కూడా ఎమ్మెల్యే భారీగా ముడుపులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. గతంలోనూ ఎమ్మెల్యే తీరును అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినా.. పరిష్కారం లభించలేదని వాపోయారు. ఎమ్మెల్యే తీరును వ్యతిరేకిస్తూ.. నిడుముక్కల గ్రామంలో "గడపగడపకు మన ప్రభుత్వం" కార్యక్రమాన్ని తామే కొనసాగిస్తామని స్పష్టం చేశారు.