ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి.. మేకల కాపరి అవతారం ఎత్తారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం దామరపల్లిలో పూజ కార్యక్రమానికి హాజరై వస్తున్న సమయంలో.. రహదారిపై భారీగా మేకలు కనిపించాయి. కారు దిగిన ఎమ్మెల్యే.. తలపాగా కట్టి, కర్ర చేతబట్టి కాసేపు మేకల కాపరిగా మారిపోయారు. అటుగా వెళుతున్న ప్రయాణికులు ఆమెను చూసి ఆశ్చర్యపోయారు. ఎమ్మెల్యే మేకలు కాయడం ఏంటని నివ్వెరపోవడం వారి వంతైంది.
మేకల కాపరి అవతారమెత్తిన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి - దామరపల్లిలో తలపాగా చుట్టి, కర్ర చేపట్టి మేకల కాపరిగా సందడి చేసిన ఎమ్మెల్యే శ్రీదేవి
గుంటూరు జిల్లా తాడికొండ మండలం దామరపల్లి ప్రజలను.. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆశ్చర్యానికి గురి చేశారు. తలపాగా కట్టి, కర్ర చేత పట్టుకుని రహదారిపై మేకలు కాస్తున్న ఆమెను చూసి.. ప్రయాణికులు విస్తుపోయారు.
దామరపల్లి సమీపాన మేకల కాపరి అవతారమెత్తిన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి