రానున్న రోజుల్లో గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో ఇసుక కొరత ఉండదని... అందరికీ అందుబాటులో ఉంటుందని తాడికొండ ఎమ్మెల్యే, వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి అన్నారు. మంగళవారం మైనింగ్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిని ఎమ్మెల్యే శ్రీదేవి కలిశారు.
'నియోజకవర్గంలో ఇసుక కొరత ఉండదు' - తాడికొండ వార్తలు
తాడికొండ నియోజకవర్గంలో ఇసుక కొరత లేకుండా...తక్కువ సమయంలోనే సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తెలిపారు.
మంత్రి పెద్దిరెడ్డిని కలిసిన ఎమ్మెల్యే శ్రీదేవి
ఈ సందర్భంగా తుళ్లూరు మండల పరిధిలోని ఇసుక రీచ్ లపై గ్రీన్ ట్రిబ్యునల్ విధించిన ఆంక్షలను ఎత్తివేశారన్నారు. ఆయా ఇసుక రీచ్లు ప్రారంభమైతే నియోజకవర్గ పరిధిలో ఇసుక సరఫరా సులభంగా ఉంటుందన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఇబ్బంది లేకుండా... ప్రతి ఒక్కరికీ తక్కువ సమయంలో ఇసుక సరఫరా అయ్యే విధంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై మంత్రితో చర్చించినట్లు శ్రీదేవి తెలిపారు.
ఇవీ చదవండి:తూర్పున తగ్గిన వరద.. తేరుకునేందుకు సమయం