ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'గడప గడప'కు మేకతోటి సుచరిత.. సమస్యలతో స్వాగతం పలికిన ప్రజలు - MLA Mekapati Sucharitha participated in Gadapa Gadapaku mana prabhuthvam

Ex-Home Minister Sucharitha: గుంటూరు జిల్లాలో 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో ఎమ్మెల్యే మేకతోటి సుచరిత పాల్గొన్నారు. అడుగడుగునా సమస్యలతో ఎమ్మెల్యేకు ప్రజలు స్వాగతం పలికారు. సమస్యలు చెప్పేందుకు వచ్చిన జనసేన పార్టీ ఎంపీటీసీ సభ్యురాలిని పోలీసులు అడ్డుకున్నారు.

మేకతోటి సుచరిత
మేకతోటి సుచరిత

By

Published : May 16, 2022, 8:27 PM IST

Ex-Home Minister Sucharitha: గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం జొన్నలగడ్డలో 'గడప గడపకు మన ప్రభుత్వంట కార్యక్రమంలో ఎమ్మెల్యే మేకతోటి సుచరితకు.. స్థానికులు సమస్యలతో స్వాగతం పలికారు. ఎమ్మెల్యేకు సమస్యలు తెలిపేందుకు వచ్చిన స్థానికులను పోలీసులు అడ్డుకున్నారు. సమస్యలు తెలిపేందుకు వీలు లేదంటూ పోలీసులు ప్రజలను పక్కకు నెట్టేశారు. దీంతో వారు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పరిస్థితి గందరగోళంగా మారడంతో ఎమ్మెల్యే సుచరిత కారు దిగి వచ్చి.. వివరాలు తెలుసుకున్నారు. గ్రామంలో పేదలకు సంక్షేమ పథకాలు అందలేదని, ధనికులకే ఇచ్చారని ఎమ్మెల్యేకు గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. పొలాలు కావాలంటూ కొంతమంది తిరుగుతున్నారని.. ప్రభుత్వం కొనుగోలు చేస్తుందా.. ఎవరు కొంటున్నారు వివరాలు చెప్పాలని కోరారు. సమస్యలు చెప్పేందుకు వచ్చిన జనసేన పార్టీ ఎంపీటీసీ సభ్యురాలు భూలక్ష్మిని పోలీసులు అడ్డుకున్నారు. ప్రజలు చెప్పే విషయాలు వినేందుకు వచ్చామని సుచరిత అన్నారు. అనంతరం ఎంపీటీసీ నుంచి వినతిపత్రం తీసుకున్నారు.

ఇదీ చదవండి:గడప గడపకు మన ప్రభుత్వం .. రెండో రోజూ సేమ్ సీన్ రిపీట్

ABOUT THE AUTHOR

...view details