ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అర్హులందరికీ ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తాం' - పేదలకు ఇళ్ల స్థలాలపై వార్తలు

గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్లలో గుంటూరు నగరవాసులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సిద్ధం చేస్తున్న భూమిని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ పరిశీలించారు. అర్హులందరికీ ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని శ్రీదేవి అన్నారు.

mla sridevi on house lands
ఇళ్ల స్థలాలపై ఎమ్మెల్యే శ్రీదేవి

By

Published : Jun 27, 2020, 7:49 PM IST

అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు. మేడికొండూరు మండలం పేరేచర్లలో గుంటూరు నగర వాసులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సిద్ధం చేస్తున్న భూమిని ఉండవల్లి శ్రీదేవి, కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ పరిశీలించారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని శ్రీదేవి అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సీఎం జగన్ అమలు చేస్తున్నారని తెలిపారు.

పనుల వేగం పెంచాలని శామ్యూల్ ఆనంద్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు మున్సిపల్ కమిషనర్ అనురాధ, ఆర్డీవో భాస్కర్ రెడ్డి, మేడికొండూరు తహసీల్దార్ కరుణ కుమార్ పాల్గొన్నారు.

ఇదీ చదవండి: పోలవరం ప్రాజెక్టులో అవినీతిపై ఆధారాలు లేవు: కేంద్ర జలశక్తి శాఖ

ABOUT THE AUTHOR

...view details