గుంటూరు జిల్లా తాడికొండ నియోజక వర్గం మేడికొండ్రు మండలం పేరచర్లలో వైకాపా శ్రేణులు నిత్యావసరాలు పంపిణీ చేశారు. పెరచర్లలో పేదలకు, పారిశుద్ధ్య సిబ్బందికి, గ్రామ వాలంటీర్లకు ఉచితంగా నిత్యావసరాలు, కూరగాయలు అందజేశారు. ముఖ్య అతిథిగా తాడికొండ నియోజక వర్గ శాసన సభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి పాల్గొని కరోనా కట్టడికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. అనంతరం దాతలను అభినందించిన ఆమె ట్రాక్టర్ నడుపుతూ గ్రామంలో సోడియం హైపో క్లోరైడ్ ద్రావకం పిచికారీ చేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.
నిత్యావసరాలు పంపిణీ చేసిన వైకాపా శ్రేణులు - తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి తాజా వార్తలు
వైకాపా నాయకులు తాడికొండ నియోజకవర్గంలో నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీదేవి పాల్గొని పేదలకు సరకులు అందజేశారు. అనంతరం ట్రాక్టర్ నడిపి గ్రామంలో ద్రావణం పిచకారీ చేశారు. కరోనా వ్యాప్తిని నివారించేందుకు ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని తెలిపారు.
నిత్యావసరాలు పంపిణీ చేసిన వైకాపా శ్రేణులు