MLA Sridevi:డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్‌ను తాను అవమానపరచేలా మాట్లాడలేదని.. ఆయన రాసిన రాజ్యాంగం వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు. ఇటీవల ప్రపంచ 4వ మాదిగ మహాసభలో తాను చేసిన ప్రసంగాన్ని ఎడిటింగ్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. తన ప్రసంగంలో తెలియక తప్పులు దొర్లి ఉంటే అంబేడ్కర్ వాదులు, దళిత బహుజనులు క్షమించాలని కోరారు. తాను ఉద్దేశ్యపూర్వకంగా అంబేడ్కర్‌పై ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చారు.
అంబేడ్కర్, జగ్జీవన్ రాం రెండు కళ్లలాంటి వాళ్లు..
అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని తొలి నాళ్లలో కొంత మంది కులవాదులు వ్యతిరేకించినప్పటికీ.. ఆయనతో పాటు రాజ్యాంగ కమిటీ సభ్యుడిగా పని చేసిన బాబు జగ్జీవన్‌రాం పార్లమెంటులో రాజ్యాంగ ప్రతి ఫలాలలను కింది స్థాయికి చేర్చేందుకు బలియంగా కృషి చేశారని ఎమ్మెల్యే శ్రీదేవి అన్నారు. అంబేడ్కర్ మరణానంతరం రాజ్యాంగ పరిరక్షణకు బాబు జగ్జీవన్‌రాం వేసిన బాటలు.. సత్ఫలితాలు ఇచ్చాయన్న భావాన్ని మాదిగ మహాసభలో ప్రస్తావించానన్నారు.
ఎవర్ని వదిలిపెట్టేది లేదు..