ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బాపట్ల ఎంపీని పరామర్శించిన ఎమ్మెల్యే శ్రీదేవి - mla vundavalli sridevi latest news update

బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ని తాడికొండ ఎమ్మెల్యే, వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి ఆయన నివాసంలో కలిసి పరామర్శించారు. కొన్ని రోజుల క్రితం ఎంపీ నందిగం సురేష్ పై దాడికి యత్నం జరిగింది.

MLA Sridevi addressed the Bapatla MP
ఎంపీ నందిగం సురేష్ ని పరామర్శించిన ఎమ్మెల్యే

By

Published : Oct 18, 2020, 11:13 PM IST

తాడికొండ ఎమ్మెల్యే, వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ని ఆయన నివాసంలో పరామర్శించారు. కొన్ని రోజుల క్రితం సురేష్ పై జరిగిన దాడి పిరికిపంద చర్యగా భావించి ధైర్యంగా ఉండాలని ఎమ్మెల్యే శ్రీదేవి ధైర్యాన్ని నింపారు.

ఘటన జరిగిన రోజు తాను హైదరాబాద్ లో ఉండడం వల్ల కలవలేకపోయినట్టు చెప్పారు. అదే రోజు తుళ్లూరు సీఐ, డీఎస్పీలతో మాట్లాడి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు. వైకాపాలో దళితులకు సీఎం జగన్ పెద్దపీట వేశారని, ఎప్పుడూ అండగా ఉంటారని శ్రీదేవి తెలిపారు.

ఇవీ చూడండి:

రైతులకు భరోసా ఇవ్వడంలో ప్రభుత్వం విఫలం: జనసేన

ABOUT THE AUTHOR

...view details