'రూపాయికే ఇళ్లు కేటాయించిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది' - latest news of tidco homes
దేశ చరిత్రలో కేవలం రూపాయికే ఇళ్లును కేటాయించిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు. త్వరలో ఏఎంఆర్డీఏ ప్రాంతంలోని టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించబోతున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.
పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో సొంత ఇల్లు లేని కుటుంబం ఉండకూడదనే లక్ష్యంగా సీఎం జగన్ ముందుకు సాగుతున్నారని తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి అన్నారు. అసంపూర్తిగా ఉన్న ఇళ్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారని తెలిపారు. గుంటూరులోని తన కార్యాలయంలో అధికారులతో టిడ్కొ ఇళ్లపై సమీక్షించారు. దేశ చరిత్రలో కేవలం రూపాయికే ఇళ్లును కేటాయించిన ఘనత సీఎం జగన్‌కు దక్కుతుందన్నారు. త్వరలో లబ్ధిదారులకు కేటాయిస్తున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ సమీక్షలో ఏఎంఆర్డీఏ డీసీడీవో శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.