ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కలాం విజన్ యాత్రకు ఎమ్మెల్యే సంఘీభావం

తమిళనాడులోని రామేశ్వరం నుంచి ప్రారంభమైన కలాం విజన్ యాత్ర నాలుగు రాష్ట్రాల మీదుగా కొనసాగుతూ.. చిలకలూరిపేటకు చేరుకుంది. కలాం విజన్ యాత్రకు చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని సంఘీభావం తెలిపారు.

పోస్టర్​ను విడుదల చేస్తున్న ఎమ్మెల్యే
పోస్టర్​ను విడుదల చేస్తున్న ఎమ్మెల్యే

By

Published : Nov 11, 2020, 9:59 PM IST

అక్టోబర్ 15న అబ్దుల్ కలాం స్వస్థలమైన రామేశ్వరం నుంచి ప్రారంభమైన కలాం విజన్ యాత్ర నాలుగు రాష్ట్రాల మీదుగా గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేటకు చేరుకుంది. దేశ అభివృద్దిని కాంక్షిస్తూ యువతను చైతన్యపరిచే కార్యక్రమంలో భాగంగా ఈ యాత్రను చేపట్టినట్లు వైబ్రంట్స్ ఆఫ్ కలాం సంస్థ తెలిపింది. కలాం విజన్ యాత్రకు ఎమ్మెల్యే విడదల రజని సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అబ్దుల్ కలాం దేశ యువతకు ఇచ్చిన సందేశం.. కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి అనే విషయాన్ని నేటి యువత గుర్తించాలని ఆమె అన్నారు. అనంతరం కలాం విజన్ యాత్ర పోస్టర్​ను ఆవిష్కరించారు. కలాం విజన్ యాత్రకు నాయకత్వం వహిస్తున్న సంస్థ వ్యవస్థాపకులు విజయ్ కలాం, రెండు తెలుగు రాష్ట్రాల కోఆర్డినేటర్​లు... తాటిపల్లి సుధీర్, రవిరాజ్, సంస్థ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీచదవండి

డీఆర్​వోగా బాధ్యతలు స్వీకరించిన చంద్రశేఖర్ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details