ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

MLA ACTION: విద్యుత్ శాఖ ఏఈపై ఎమ్మెల్యే ఆగ్రహం.. ఎందుకంటే..? - గుంటూరు జిల్లా వార్తలు

గుంటూరు జిల్లాలో ఓ అధికారి అవినీతికి పాల్పడుతున్నాడంటూ రైతులు ఇచ్చిన ఫిర్యాదు మీద.. స్థానిక ఎమ్మెల్యే నంబూరు శంకరరావు స్పందించారు. విద్యుత్ కనెక్షన్లు ఇచ్చేందుకు తీసుకున్న డబ్బును సాయంత్రానికల్లా తిరిగి బాధితులందరికీ తిరిగి చెల్లించాలని ఆదేశించారు. అతనిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటానని చెప్పారు.

ఎమ్మెల్యే నంబూరు శంకరరావు
విద్యుత్ శాఖ ఏఈ పై ఎమ్మెల్యే ఆగ్రహం

By

Published : Jul 8, 2021, 8:35 PM IST

గుంటూరు జిల్లాలో.. రైతులకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చేందుకు విద్యుత్ శాఖ ఏఈ లంచాలు డిమాండ్​ చేశాడు. ఈ విషయాన్ని అన్నదాతలు స్థానిక ఎమ్మెల్యే నంబూరు శంకరరావు దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయమై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. తీసుకున్న సొమ్మును వెంటనే తిరిగి ఇవ్వాలని ఏఈని ఆదేశించారు. క్రోసూరు మండలంలో విద్యుత్​ శాఖ ఏఈగా పని చేస్తున్న అంజనీ రావు అనే ప్రభుత్వ ఉద్యోగి ఈ అవినీతికి పాల్పడ్డాడు.

మండలంలోని ఎర్రబాలెం, క్రోసూరుతో పాటు పలు గ్రామాల్లో కొత్త కరెంట్​ కనెక్షన్లు ఇచ్చేెందుకు లంచాలు తీసుకున్నాడని ఆరోపణలు ఎదుర్కొన్నాడు. నేడు నిర్వహించిన రైతు దినోత్సవానికి పెదకూరపాడుకు వచ్చిన సదరు ఎమ్మెల్యేకు ఈ విషయమై రైతులు ఫిర్యాదు చేశారు. తీసుకున్న డబ్బును సాయంత్రానికల్లా తిరిగి చెల్లించాలని ఏఈని ఎమ్మెల్యే ఆదేశించారు. అంజనీరావుపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని.. ఈ మేరకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details