హైకోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు ఇస్తే తెదేపా వారికి ఎందుకంత సంబరమని ఎమ్మెల్యే కిలారి రోశయ్య ప్రశ్నించారు. వికేంద్రీకరణ జరగటం తథ్యమన్నారు. పదేళ్లు హైదరాబాద్లో రాజధానిగా ఉండే అవకాశం ఉన్నా.. ఇక్కడకు ఎందుకు వచ్చారని... ఇక్కడ తెదేపాకు చెందిన వారి భవనాలకు కోట్లాది రూపాయలు ఎందుకు అద్దెలు చెల్లించారని ప్రశ్నించారు. 2014 ఎన్నికల ప్రణాళికలో అమరావతి గురించి తెదేపా మేనిఫెస్టోలో చూపించలేదన్నారు. రాజధానికి అంత భూమి అవసరం లేదని విపక్షాలు చెప్పినా.. చంద్రబాబు పట్టించుకోలేదని తెలిపారు. ఐదేళ్లలో అమరావతి ఎందుకు నిర్మించలేదని... అలాగే మిగతా ప్రాంతాలను ఎందుకు విస్మరించారని రోశయ్య ప్రశ్నించారు.
'అమరావతి కోసం తెదేపా ఎమ్మెల్యేలు రాజీనామా చేసి గెలవాలి'
అమరావతి కోసం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి గెలవాలని గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య డిమాండ్ చేశారు. 48 గంటల్లో ప్రభుత్వాన్ని రద్దు చేయాలన్న చంద్రబాబు సవాల్ కు ఆయన స్పందించారు. తాము అమరావతిని మార్చటం లేదని... కేవలం పరిపాలనా విధానాన్ని మాత్రం వికేంద్రీకరిస్తున్నామని వివరించారు.
mla roshaiah demands for tdp mla's resign
అమరావతి కోసం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి గెలవాలని రోశయ్య డిమాండ్ చేశారు. తాము అమరావతిని మార్చటం లేదని... కేవలం పరిపాలనా విధానాన్ని మాత్రం వికేంద్రీకరిస్తున్నామని వివరించారు.
ఇదీ చదవండి:కార్యాలయంలో చేపట్టిన మార్పులపై ఎస్ఈసీ విచారణ