ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆ భూములు కొన్నవారని వదిలే ప్రసక్తే లేదు' - మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే లెటెస్ట్ కామెంట్స్

రాజధానిలో అసైన్డ్ భూములు కొనుగోలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. దళిత రైతుల నుంచి చౌకగా భూములు కొన్నవారిని వదిలే ప్రసక్తే లేదన్నారు. గత ప్రభుత్వంలో అన్యాయం జరిగిన రైతులకు న్యాయం చేస్తామన్నారు.

Mla rk on assigned lands in mangalagiri
ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి

By

Published : Dec 13, 2019, 10:02 AM IST

మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
రాజధాని ప్రాంతంలో అసైన్డ్ భూములు కొన్న వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పారు. 1950 ముందు ఇచ్చిన అసైన్డ్ భూములు కొనుగోలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును నమ్మి భూములిచ్చిన దళిత రైతులకు న్యాయం చేస్తామన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లపై ఆయన... గురువారం సమీక్ష నిర్వహించారు. దళిత రైతుల భూములను చౌకగా కొనుగోలు చేసిన వారందరిపై చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. రైతులకు ఇస్తామన్న ప్యాకేజీపై న్యాయం జరగలేదన్నారు.

ఇదీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details