అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం పారదర్శకంగా నివేశన స్థలాలు, ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే విడుదల రజిని పేర్కొన్నారు. చిలకలూరిపేట మండలం మురికిపూడి గ్రామంలో శుక్రవారం... అర్హులైన లబ్ధిదారులకు నివేశన స్థలాల పట్టాలను పంపిణీ చేశారు.
ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలన్నీ నూరు శాతం అమలు చేస్తున్నారని వివరించారు. కార్యక్రమంలో అధికారులు, వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.