ప్రజలు మేలు చేసే ప్రభుత్వం ఏది అనేది రాష్ట్రం మొత్తానికి తెలుసునని ఎమ్మెల్యే రజిని అన్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో గత ప్రభుత్వం హయాంలో నిర్మించిన టిడ్కో గృహాలను ఆమె లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పార్టీ పేరు చెప్పుకొని వ్యక్తిగత లబ్ధికోసం ఆరాటపడే నాయకుల రాజకీయ రంగు ప్రజలకు తెలుసన‌్నారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. టిడ్కో నివాస గృహాల పంపిణీలో ఎవరికీ ఆందోళన లేదన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో ప్రభుత్వానికి పెద్ద ఎత్తున లభిస్తున్న మద్దతు చూసి ప్రతిపక్షాలు ఈర్ష్య పడుతున్నాయన్నారు.
లబ్ధిదారులకు ఎమ్మెల్యే రజిని టిడ్కో గృహాల పంపిణీ - Distribution Tidco houses latest news update
గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో 52 ఎకరాలలో నిర్మించిన టిడ్కో గృహాలను ఎమ్మెల్యే రజిని లబ్ధిదారులకు పంపిణీ చేశారు. టిడ్కో గృహాలకు సంబంధించి ప్రతిపక్షాలు అనవసరపు రాద్ధాంతం చేస్తున్నాయన్నారు.
ఎమ్మెల్యే రజిని టిడ్కో గృహాల పంపిణీ