ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసం ఘటనతో.. వైకాపాకు సంబంధం లేదు: రామకృష్ణారెడ్డి

గుంటూరు జిల్లా దుర్గిలో.. ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసం ఘటన దురదృష్టకరమని.. మాచర్ల ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ ఘ‌ట‌నతో వైకాపాకు ఎలాంటి సంబంధమూ లేదని.. తెదేపా కావాలనే దీన్ని రాజకీయం చేస్తోందని అన్నారు.

mla pinneli talks about destroying ntr statue
ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసం ఘటనకు వైకాపాకు సంబంధం లేదు: పిన్నెల్లి రామకృష్ణారెడ్డి

By

Published : Jan 3, 2022, 7:26 PM IST


గుంటూరు జిల్లా దుర్గిలో.. ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం ఘటన దురదృష్టకరమని.. మాచర్ల ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణరెడ్డి అన్నారు. ఈ ఘ‌ట‌నతో వైకాపాకు ఎలాంటి సంబంధమూ లేదని స్పష్టం చేశారు. ఈ సంఘ‌ట‌న‌ను తెదేపా రాజకీయంగా వాడుకోవ‌డం దారుణమని అన్నారు.

ఎన్టీఆర్​ను వెన్నుపోటు పొడిచిన మొద‌టి వ్యక్తి చంద్రబాబేనన్నారు. ఫ్యాక్షన్ నేప‌థ్యం ఉన్న వ్యక్తిని.. తెదేపా మాచర్ల నియోజకవర్గ ఇన్​ఛార్జ్ గా నియమించారని, ఆయ‌న‌కున్న ఫ్యాక్షన్ నేప‌థ్యంతో జనాలను భ‌య‌బ్రాంతుల‌కు గురిచేసి.. లా అండ్ ఆర్డర్ సమస్యలు సృష్టించాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి ఘ‌ట‌న‌ల‌ను వైకాపా ఖండిస్తుందన్నారు.

ఇదీ చదవండి:

CBN: ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసంపై చంద్రబాబు ఆగ్రహం.. డీజీపీకి లేఖ

ABOUT THE AUTHOR

...view details