గుంటూరు జిల్లా తెనాలిలోని వైకుంఠపురంలో గల శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామిని వేమూరు శాసన సభ్యులు నాగార్జున దర్శించుకున్నారు. తమ కుటుంబం కరోనా నుంచి కోలుకున్న సందర్భంగా స్వామి వారిని దర్శించుకుని.. తలనీలాలు సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఆ విగ్రహాలపై చేయి వేయగలరా.. తెలంగాణ మంత్రులకు వైకాపా ఎమ్మెల్యే సవాల్ - guntur district updates
తెలంగాణలోనూ తమ నాయకులు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి విగ్రహాలు ఉన్నాయని.. తెలంగాణ మంత్రులకు దమ్ముంటే ఆ విగ్రహాలను టచ్ చేసి చూడండని ఎమ్మెల్యే మెరుగు నాగార్జున సవాల్ విసిరారు. శనివారం ఆయన తెనాలిలోని వైకుంఠపురంలో గల శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎమ్మెల్యే మెరుగు నాగార్జున
తెలంగాణ మంత్రులు.. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. తెలంగాణ మంత్రులు తమ అధిష్టానానికి తెలిసి మాట్లాడుతున్నారో లేక రాజకీయ స్వలాభం కోసం మాట్లాడుతున్నారో గానీ.. తమ వ్యాఖ్యలను పునః పరిశీలించుకోవాలని సూచించారు. తెలంగాణలోనూ తమ నాయకుల విగ్రహాలు ఉన్నాయని... దమ్ముంటే ఆ విగ్రహాలపై చేయి వేసి చూడాలని సవాల్ విసిరారు.
ఇదీ చదవండి