దళితుల అభివృద్ధి సీఎం జగన్‌తోనే సాధ్యం:ఎమ్మెల్యే నాగార్జున - mla nagarjuna speech in assembly
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానంపై వేమూరు ఎమ్మెల్యే మేరుగు నాగార్జున ప్రసగించారు. దళితుల అభివృద్ధి వైసీపీ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానంపై వేమూరు ఎమ్మెల్యే మేరుగు నాగార్జున ప్రసగించారు. తొలిసారిగా చట్టసభలోకి అడుగుపెట్టినందుకు సంతోషిస్తున్నానని అన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికవ్వటానికి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కల్పించిన రిజర్వేషన్లు ఒక కారణమైతే అవకాశం ఇచ్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని తెలిపారు. గత ఐదేళ్లలో దేశ వ్యాప్తంగా దళితులపై దాడులు జరిగితే అందులో ఏపీ నాల్గొవ స్థానంలో నిలిచిందన్నారు. అనేక జిల్లాలో దళిత మహిళలపై దాడులు చేస్తే కనీసం పట్టించుకోలేదని మండిపడ్డారు. దళితులు సంక్షేమం , అభివృద్ధి ముఖ్యమంత్రి జగన్ తోనే సాధ్యమని అన్నారు.