గుంటూరులో ఇవాళ జరిగిన అగ్నిప్రమాదం సమయంలో స్థానిక ఎమ్మెల్యే ముస్తఫా వ్యవహరించిన తీరు విమర్శలకు దారితీసింది. ఓవైపు అగ్నిమాపకశాఖ సిబ్బంది మంటలు ఆర్పటానికి తీవ్రంగా కష్టపడుతోంటే... ఎమ్మెల్యే మాత్రం అక్కడ నిలబడి సిగరెట్ వెలిగించారు. ఓ వైపు మంటల్లో పొగాకు బేళ్లు తగలబడుతుంటే... బాధ్యతగా ఉండాల్సిన ప్రజాప్రతినిధి సిగరెట్ తాగుతూ గుప్పుగుప్పున పొగ వదులుతూ కనిపించారు.
ఏమైందీ.. ఎమ్మెల్యేకు..? ఒకవైపు ప్రమాదం.. మరోవైపు పొగ - fire accident at guntur
ఇళ్లు కాలి ఒకడు ఏడుస్తుంటే చుట్ట వెలిగించటానికి నిప్పు అడిగాడట వెనకటికి ఒకడు. అలాగే ఉంది ఈ వైకాపా ఎమ్మెల్యే వ్యవహారం. పొగాకు బేళ్లు తగులబడి గోడౌన్ వాళ్లు ఏడుస్తుంటే ఈ ఎమ్మెల్యే మాత్రం పొగతాగుతున్నారు. అగ్నిప్రమాదం జరిగి లబోదిబో అంటుంటే, అగ్నిమాపక సిబ్బంది చచ్చీ చెడీ మంటలు ఆర్పుతుంటే సిగరెట్ వెలిగించి తాపీగా దమ్ము కొడుతున్నారా ప్రజాప్రతినిధి.
అగ్నిప్రమాద ఘటనా స్థలిలో పొగ తాగుతున్న ఎమ్మెల్యే
మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బందికి సహకరించటం లేదా... గోదాములోని సరకు వేరేచోటికి తరలించటంపై దృష్టి సారించకుండా పొగ తాగటం విస్మయానికి గురిచేసింది. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నేరమని తెలియదా లేక... తెలిసి కూడా ఉల్లంఘించారా అని స్థానికులు ప్రశ్నించారు.
ఇదీ చదవండి: ఆన్లైన్ బోధన.. ఆగస్టు 3 నుంచి మే రెండో వారం వరకు విద్యాసంవత్సరం
Last Updated : Jul 2, 2020, 3:32 PM IST