ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తాగునీటి రిజర్వాయర్ కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే ముస్తఫా - గుంటూరు జిల్లా నందివెలుగు రోడ్డు తాజా వార్తలు

గుంటూరు జిల్లా నందివెలుగు రోడ్డులో ఉన్న తాగునీటి రిజర్వాయర్ కేంద్రాన్ని... గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా పరిశీలించారు. మంచినీరు సరఫరా సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

MLA Mustafa inspected drinking water reservoir center in guntur
తాగునీటి రిజర్వాయర్ కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే ముస్తఫా

By

Published : Dec 11, 2020, 3:32 PM IST

గుంటూరు నగరానికి మంచి నీటిని సరఫరా చేసే ప్రధాన తాగునీటి రిజర్వాయర్ కేంద్రాన్ని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా పరిశీలించారు. ఏలూరు సంఘటనను దృష్టిలో పెట్టుకుని... నందివెలుగు రోడ్డులో ఉన్న ఈ కేంద్రాన్ని పరిశీలించినట్లు ఆయన తెలిపారు. తాగునీటిని ప్రతిరోజు పరీక్షించి... నీటి సరఫరా సమయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. మంచినీటి సరఫరాలో ఏదైనా సందేహం ఉంటే వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు. కాచి చల్లార్చిన నీటిని తాగాలని ఎమ్మెల్యే ప్రజలకు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details