రాజకీయ లబ్ధి కోసమే దుర్గగుడిలో సింహాల చోరీ అంశాన్ని ప్రతిపక్షాలు రచ్చ చేస్తున్నాయని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ ఆరోపించారు. ఈ అంశంపై విచారణ జరుగుతుండగానే.... దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లిపై తెదేపా నేతలు బురద జల్లుతున్నారని ఆరోపించారు.
మంత్రి వెల్లంపల్లి ఇంట్లో విగ్రహాలున్నాయంటూ తప్పుడు ప్రచారం చేస్తూ... ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. విజయవాడలో రోడ్ల విస్తరణ సమయంలో 41 ఆలయాలు కూల్చివేశారని... ఆనాడు ఎందుకు మాట్లాడలేదని గిరిధర్ ప్రశ్నించారు. తెదేపా నేతలు కులమతాల పేరుతో రెచ్చగొట్టడం మానుకోవాలని హితవు పలికారు.