గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలోని ముస్లిం ఖబరస్థాన్ను నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సందర్శించారు. ఇటీవల నరసరావుపేట నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జి డాక్టర్ చదలవాడ అరవిందబాబు ఖబరస్థాన్ను సందర్శించి.. ఖబరస్థాన్ అభివృద్ధిలేక పిచ్చిగడ్డి మెులిచి అక్కడ కట్టడాలు శిథిలమవుతున్నాయన్నారు. దీనివల్ల ముస్లిం ప్రజల అంతిమ సంస్కారాలకు ఇబ్బంది వాటిల్లితోందని ఆరోపించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే.. ఖబరస్థాన్ను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతిపక్షం నిర్మాణాత్మక సూచనలు ఇస్తే వాటిని తప్పకుండా స్వీకరిస్తామన్నారు. గత ప్రభుత్వంలోని ఖరస్థాన్ కమిటీ లెక్కలు చెప్పాలన్నారు. పాత కమిటీ లెక్కలు చెప్పకపోతే వారిపై అధికారికంగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హెచ్చరించారు. నిజనిజాలు తెలుసుకొని విమర్శలు చేయాలని ఎమ్మెల్యే హితువు పలికారు.
ముస్లిం ఖబరస్థాన్ను సందర్శించిన ఎమ్మెల్యే గోపిరెడ్డి - ఖబరస్థాన్ను సందర్శించిన ఎమ్మెల్యే న్యూస్
తెదేపా నేత డాక్టర్ చదలవాడ అరవిందబాబు ఆరోపణలపై స్పందించిన.. స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ముస్లిం ఖబరస్థాన్ను సందర్శించారు. నిజనిజాలు తెలుసుకొని విమర్శలు చేయాలని హితువు పలికారు.
ముస్లిం ఖబరస్థాన్ను సందర్శించిన ఎమ్మెల్యే గోపిరెడ్డి