ఇళ్ల ముందు గృహ యజమానులు చేపట్టిన అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తే... తెదేపా నాయకులు దానిని వక్రీకరిస్తున్నారని నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. నరసరావుపేట మండలం ఇస్సపాలెం పరిధిలో కొందరు వారి ఇళ్ల ముందు అక్రమ నిర్మాణాలు చేపడితే... అక్కడి పంచాయతీ అధికారులు వాటిని తొలగించారని తెలిపారు. తెదేపా నాయకులు ఆ విషయాన్ని వక్రీకరించి వైకాపా ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. అధికారులు అక్రమ కట్టడాలను తొలగించాలని రెండుసార్లు నోటీసులు ఇచ్చినా... పట్టించుకోకపోవడంతో తొలగించారని వివరించారు.
'అక్రమ నిర్మాణాల కూల్చివేతను తెదేపా నేతలు వక్రీకరిస్తున్నారు'
ఇళ్ల ముందు అక్రమ నిర్మాణాల కూల్చివేతను తెదేపా నాయకులు వక్రీకరిస్తున్నారని... నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు.
ఎమ్మెల్యే గోపిరెడ్డి
ఇదీ చదవండి: