నరసరావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. నరసరావుపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో 432 మందికి, రొంపిచర్ల మండలం పరగటిచర్ల గ్రామంలో 158 మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు. వైకాపా ప్రభుత్వం పేదలకు అనేక సంక్షేమ పథకాలను అందిస్తుందని ఆయన చెప్పారు.
ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. అర్హులై ఉండి ఇళ్లపట్టాలు రానివారు ఎవరైనా ఉంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని.. వారందరికీ రెండో దశలో ఇళ్లపట్టాలు అందజేస్తామని చెప్పారు.