ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'లోటు బడ్జెట్​లో ఉన్నా.. సంక్షేమం ఆపట్లేదు' - గుంటూరులో నిత్యావసరసరకులు పంపిణీచేసిన ఎమ్మెల్యే

ఏడాదిలోనే ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత వైకాపా ప్రభుత్వానిదని ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ అన్నారు. ప్రతిపక్షాలు కావాలనే ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు.

mla giridhar
mla giridhar

By

Published : Jun 4, 2020, 4:44 PM IST

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే ఇచ్చిన హామీలను అమలు చేసిందని గుంటురు పశ్చిమ ఎమెల్యే మద్దాలి గిరిధర్ అన్నారు. గుంటూరు గీతామందిరంలో ఆయన 2వేల మంది పేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. సంవత్సరంలోనే సీఎం సంక్షేమ పథకాలన్నీ అములు చేశారన్నారు.

ఐదేళ్లు అధికారంలో ఉన్న తెదేపా ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్నా.. పేదలకు సంక్షేమ పథకాలు అందించడంలో వైకాపా ఎక్కడా వెనుకడుగు వేయలేదన్నారు. ప్రతిపక్షాలు కావాలనే ప్రభుత్వం పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details