గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని నల్ల చెరువులో 3 రోజుల నుంచి కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఆ ప్రాంతాల్లోని కంటైన్మెంట్ జోన్లను... కంట్రోల్ రూమ్, వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ పరిశీలించారు. కంటైన్మెంట్ జోన్లలో ప్రజలకు అందిస్తున్న సేవలను తీసుకొంటున్న జాగ్రత్తల గురించి ఆరా తీశారు.
ఏఎన్ఎమ్ లు, ఆశా వర్కర్లకు తగిన సూచనలు చేశారు. ప్రజలు ఎవరూ బయటకు రావద్దని.. అవసరమైన వస్తువులను ఇంటికే పంపిస్తారని చెప్పారు. ప్రజలు అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని.. శానిటైజర్లు వాడాలని సూచించారు. అత్యవసర సమయంలో మాత్రమే ప్రజలకు బయటకు రావాలన్నారు.