ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరులో కిడ్నాప్ కలకలం... విచారణకు తీసుకెళ్లబోయామన్న పోలీసులు.. - latest news in guntur

గుంటూరు మిర్చియార్డు వద్ద ఓ వ్యాపారిని కిడ్నాప్ చేసేందుకు వైకాపానేతలు యత్నించారు. తోటి వ్యాపారులు అడ్డుకోవటంతో....వారు పరారయ్యారు. అయితే తామే ఓ కేసు విషయంలో ఆయన్ని తీసుకెళ్లేందుకు యత్నించామని పోలీసుల ప్రకటనతో అంతా ఆశ్చర్యపోయారు.

mla-followers-tried-to-kidnap-a-trader-at-mirchiyard-in-guntur
గుంటూరు మిర్చియార్డు వద్ద కిడ్నాప్ కలకలం

By

Published : Nov 6, 2020, 12:49 PM IST

కిడ్నాప్ కలకలం

గుంటూరు మిర్చియార్డు వద్ద వ్యాపారి కిడ్నాప్ యత్నం కలకలం రేపింది. పల్నాడు ప్రాంతంలోని కొందరు వ్యక్తులు మిర్చి వ్యాపారి శేఖర్ రెడ్డిని కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. రైతుల నుంచి మిర్చి కొనుగోలు చేసిన శేఖర్ రెడ్డి వారికి ఇంకా డబ్బులు పూర్తిగా చెల్లించలేదు. దీంతో శేఖర్ రెడ్డిని తమ వెంట తీసుకెళ్లేందుకు వారంతా మిర్చి యార్డు దగ్గరకు వచ్చారు.

శేఖర్ రెడ్డిని బలవంతంగా తీసుకెళ్లేందుకు ఆ గుర్తు తెలియని వ్యక్తులు ప్రయత్నించారు. చుట్టుపక్కల ఉన్న వ్యాపారుల వారి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. పరిస్థితి తమ చేయి దాటిందని గ్రహించిన వారంతా అక్కడి నుంచి పరారయ్యారు.

కిడ్నాప్​ కాదు... విచారణకు తీసుకెళ్లబోయాం: నగరంపాలెం సీఐ

మిర్చి వ్యాపారి శేఖర్​రెడ్డి కిడ్నాప్​ యత్నంపై పోలీసులు స్పందించారు. కారంపూడి పోలీస్టు స్టేషన్​లో ఆయనపై కేసు ఉందని... నగరంపాలెం సీఐ మల్లికార్జున తెలిపారు. ఆ కేసులో అరెస్టు చేసేందుకు పోలీసులు వచ్చారని పేర్కొన్నారు. మఫ్టీలో ఉన్నందున శేఖర్​రెడ్డి ఆయన బంధువులు పొరపాటు పడ్డారని చెప్పారు. పోలీసుల సహకారంతో ఆయన్ని కారంపూడి పంపిస్తున్నట్టు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

దేశీయ మార్కెట్లోకి రానున్న గుంటూరు మిర్చి యార్డు కారంపొడి

ABOUT THE AUTHOR

...view details