వైకాపా ప్రభుత్వంపై చంద్రబాబు వక్రీకరణ విమర్శలు మానుకోవాలని వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. రాష్ట్రంలో సీఎం జగన్ రైతు పక్షపాత పాలన చేస్తున్నందున తెదేపా భయపడుతోందని వ్యాఖ్యానించారు. తుపాను కారణంగా నష్టపోయిన రైతుల వివరాలు సేకరించి.. డిసెంబర్ చివరి నాటికి పరిహారాన్ని చెల్లించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నారని స్పష్టం చేశారు. రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు వక్రీకరిస్తూ విమర్శించడాన్ని ఆయన ఖండించారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతు వద్దకే మెరుగైన సేవలు తీసుకెళ్లిన ఘనత సీఎం జగన్కు దక్కుతుందన్నారు.
ప్రభుత్వంపై తెదేపా వ్యాఖ్యలు మానుకోవాలి: ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు - గుంటూరులో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వ్యాఖ్యలు
ప్రభుత్వంపై తెదేపా వ్యాఖ్యలు మానుకోవాలని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు చేసిన విమర్శలను ఆయన గుంటూరులో ఖండించారు.
ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు