ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విను'కొండ'పైకి.. రోప్ వే కు అనుమతి తీసుకున్నాం: ఎమ్మెల్యే

వినుకొండ మున్సిపాలిటీ కి చెందిన 22 ఎకరాల స్థలంలో ఎటువంటి కమ్యూనిటీలకు, పార్టీలకు ఇచ్చే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తేల్చి చెప్పారు. నియోజకవర్గంలో ఇంటింటికి తాగునీరు అందించే అందుకు 4 మండలాలకు 20 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినట్లు తెలిపారు. రైతులు తమ సమస్యలను నేరుగా తెలియజేయవచ్చని అన్నారు.

MLA Bolla Brahmanayudu
ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు

By

Published : Oct 14, 2020, 9:12 PM IST

గుంటూరు జిల్లా, వినుకొండ నగరంలోని ఎన్సీపీ భూములలో 22 ఎకరాలు తిరిగి మునిసిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం అందించినందుకు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ స్థలంలో ఎటువంటి కమ్యూనిటీలకు , పార్టీలకు అన్యాక్రాంత చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. నియోజకవర్గంలో ఇంటింటికి తాగునీరు అందించే అందుకు 4 మండలాలకు 20 కోట్ల రూపాయలు మంజూరు అయినట్లు తెలిపారు.

వినుకొండలోని కొండపైకి ఘాట్ రోడ్డు నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేస్తామని ... "రోప్ వే" కోసం అనుమతి తీసుకున్నట్లు వివరించారు. నియోజకవర్గ ప్రజలకు , రైతులకు అన్ని వేళలా అందుబాటులో ఉంటానని ఎవరికి ఏ సమస్య వచ్చినా నేరుగా తనకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details