కరోనా వ్యాప్తి నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయంతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొందని అనగాని సత్యప్రసాద్ అన్నారు. కరోనా కేసులు పెరుగుతుంటే విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతారా..? అని ప్రశ్నించారు. తెలంగాణ మాదిరిగా పదో తరగతి విద్యార్థులను ప్రమోట్ చేయాలని అనగాని కోరారు.
పదో తరగతి విద్యార్థులను ప్రమోట్ చేయాలి: అనగాని - తెలంగాణ పదో తరగతి పరీక్షలు వాయిదా న్యూస్
కరోనా నివారణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని కోరారు.
![పదో తరగతి విద్యార్థులను ప్రమోట్ చేయాలి: అనగాని mla anagani satyaprasad on 10th exams](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7610049-262-7610049-1592113592497.jpg)
mla anagani satyaprasad on 10th exams