గుంటూరు జిల్లాలో ఆధునీకరించిన సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్, ముప్పాళ్ల పోలీస్ స్టేషన్ల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే అంబటి రాంబాబు, గుంటూరు గ్రామీణ ఎస్పీ విశాల్ గున్నీ పాల్గొన్నారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లను ఆధునీకరించి ఫిర్యాదుదారులకు ప్రశాంత వాతావరణాన్ని కల్పిస్తామని ఎస్పీ విశాల్ గున్నీ అన్నారు. బాధితుల సమస్యలను తెలుసుకుని సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టిన నాడు-నేడు కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుని పోలీస్ స్టేషన్లలో మార్పులు తీసుకువస్తున్నట్టు అంబటి రాంబాబు తెలిపారు.
ఆధునీకరించిన ఠాణాలను ప్రారంభించిన ఎమ్మెల్యే, ఎస్పీ - సత్తెనపల్లి ఎమ్మెల్యే
గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్, ముప్పాళ్ల పోలీస్ స్టేషన్లను ఆధునీకరించారు. ఈ ఠాణాల ప్రారంభోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే అంబటి రాంబాబు, గుంటూరు గ్రామీణ ఎస్పీ విశాల్ గున్నీ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.

ఆధునీకరించిన ఠాణాలను ప్రారంభించిన ఎమ్మెల్యే అంబటి, ఎస్పీ విశాల్