గుంటూరు జిల్లా మంగళగిరి శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలపై శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా నేపథ్యంలో ఏటా ఇచ్చే శంకుతీర్థం, వీవీఐపీ దర్శనాలను నిలుపుదల చేయాలని సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. ఎవరైనా ప్రత్యేక దర్శనం కోరుకుంటే రూ. 200 చెల్లించి టిక్కెట్ కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. రెండుగంటలకోసారి హైపో ద్రావణంతో ఆలయ పరిసరాలను శుభ్రం చేయాలన్నారు. అనంతరం ముక్కోటి పండుగ కార్యక్రమాల గోడ పత్రికను ఎమ్మెల్యే ఆవిష్కరించారు.
ముక్కోటి ఏకాదశి నిర్వహణపై ఎమ్మెల్యే ఆళ్ల సమీక్ష - ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి సమీక్ష
ముక్కోటి ఏకాదశి సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరి శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి ఆలయంలో ఏటా ఇచ్చే శంకుతీర్థం, వీవీఐపీ దర్శనాలను నిలుపుదల చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. కార్యక్రమ నిర్వహణపై సమీక్ష నిర్వహించిన ఆయన...ఎవరైనా ప్రత్యేక దర్శనం కోరుకుంటే రూ. 200 చెల్లించి టిక్కెట్ కొనుగోలు చేయాలని సూచించారు.
![ముక్కోటి ఏకాదశి నిర్వహణపై ఎమ్మెల్యే ఆళ్ల సమీక్ష ముక్కోటి ఏకాదశి నిర్వహణపై ఎమ్మెల్యే ఆళ్ల సమీక్ష](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9778366-300-9778366-1607183563156.jpg)
ముక్కోటి ఏకాదశి నిర్వహణపై ఎమ్మెల్యే ఆళ్ల సమీక్ష