అసైన్డ్ భూములను విక్రయించుకునేందుకు అప్పటి తెదేపా ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 41 చట్ట విరుద్ధమని.. ఈ అంశంపైనే ఫిర్యాదు చేశామని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఈ జీవో వల్ల ఎస్సీలు తమ భూమి పై అజమాయిషీ కోల్పోవడంతో పాటు కొంతమంది అక్రమంగా అసైన్డ్ భూములను కొనుగోలు చేశారని ఎమ్మెల్యే ఆరోపించారు. ఈ భూములు తీసుకునేముందు ఎస్సీలకు ఒక్కొక్కరికి గుంటూరు జిల్లాలో సారవంతమైన రెండెకరాల భూమి ఇచ్చి.. వాటిని తీసుకుంటే బాగుండేదన్నారు. ఏ ఒక్క ఎస్సీ రైతు నష్టపోకూడదనే తన ఉద్దేశమన్నారు. శాసన రాజధాని అయిన అమరావతిలో పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, అందులో భాగంగానే రహదారుల విస్తరణ ప్రారంభించామన్నారు. 22 కోట్లతో నిర్మించే మంగళగిరి-పెదపరిమి రహదారి నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు.
అమరావతిలో రహదారులు విస్తరణ పనులను ప్రారంభించిన ఆళ్ల రామకృష్ణారెడ్డి - అమరావతిలో అభివృద్ధి పనులు తాజా సమాచారం
అసైన్డ్ భూములను విక్రయించుకునేందుకు గత ప్రభుత్వ ఇచ్చిన జీవో 41 చట్ట విరుద్ధమని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఈ అంశంపైనే ఫిర్యాదు చేశారు.
ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
TAGGED:
గుంటూరు జిల్లా తాజా వార్తలు