MLA Alla Ramakrishna Will Join Congress Party:కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత వైసీపీ తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఖచ్చితంగా పోరాటం చేస్తామని గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి (MLA Alla Ramakrishna) చెప్పారు. మంగళగిరిలోని ఆయన అనుచరులతో ఆర్కే సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతికి వ్యతిరేకంగా న్యాయస్థానాలలో ఎప్పుడు కేసులు వేయలేదన్నారు. అమరావతి విషయంలో తన నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంటనే అందరికీ చెబుతానని స్పష్టం చేశారు. షర్మిల కాంగ్రెస్లో చేరిన వెంటనే తాను విజయవాడలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకుంటానని తెలిపారు.
ఆశలు రేపి మొండిచేయి చూపి, ఆర్కేకే వైసీపీలో ఈ దుస్థితి ఉంటే మిగిలిన వారి పరిస్థితేంటి?
MLA Alla Ramakrishna Allegations on YCP Govt:సంక్షేమాన్ని మాత్రమే నమ్ముకుని అభివృద్ధిని గాలికి వదిలేస్తే వైసీపీ మళ్లీ అధికారంలోకి ఎలా వస్తుందని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి నిలదీశారు. మంగళగిరికి రూ.1200 కోట్లు కేటాయించామని ఆర్భాటంగా ప్రకటించిన సీఎం జగన్ చివరికి రూ.120 కోట్లకు కుదించారన్నారు. జగన్ మాటలు నమ్మి సొంత డబ్బులతో అభివృద్ధి పనులు చేపడితే ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదన్నారు. అభివృద్ధి పనులు చేయకుండా మళ్లీ మంగళగిరి ప్రజలను ఓట్లు అడగలేకే వైసీపీ, ఎమ్మెల్యేకు రాజీనామా చేశామన్నారు. వైసీపీకి ఎంత సేవ చేశానో నాకు తెలుసు ఆ పార్టీలో ఉండి సర్వస్వం పోగొట్టుకున్నానని అన్నారు. ఇకపై వైఎస్ షర్మిల వెంట నడుస్తానని, షర్మిలమ్మ ఏ నిర్ణయం తీసుకున్నా ఆమె వెంటే ఉంటానని తెలిపారు. మంగళగిరి ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు. ఇప్పటి వరకూ జరగని అభివృద్ధి నాలుగేళ్లలో చేసి చూపించాను. స్వయంగా నేనే రూ.8 కోట్ల వరకు బయట అప్పులు తెచ్చి కాంట్రాక్టర్లకు ఇచ్చానని అన్నారు.