గుంటూరు జిల్లా తాడేపల్లిలో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో మండల అధికారులతో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి సమీక్షించారు. కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతంలో చేపట్టిన చర్యలపై చర్చించారు. ప్రజలకు సకాలంలో రేషన్ సరుకులు అందుతున్నాయా? రెడ్ జోన్ ప్రాంతంలో కూరగాయలు, మందుల సరఫరా ఎలా ఉందన్నది ఆరా తీశారు. కరోనా నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
'సకాలంలో రేషన్ అందుతోందా?.. కూరగాయలు అందుతున్నాయా?' - corona cases in guntur
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్టారెడ్డి అధికారులతో సమీక్షించారు. తాడేపల్లిలో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
mla alla ramakrishna reddy