'ఆలపాటి' అభ్యంతరం - MODI TOUR
భాజపాపై తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన మోదీని రాష్ట్రానికి ఎలా ఆహ్వానించారని ప్రశ్నించారు.
మాట్లాడుతున్న ఆలపాటి రాజేంద్రప్రసాద్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనపై గుంటూరు జిల్లా తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రప్రజలకు అన్యాయం చేసిన మోదీ... ఎలా పర్యటిస్తారని ప్రశ్నించారు. విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. హామీల అమలు తర్వాతే రాష్ట్రంలో అడుగుపెట్టాలన్నారు. ప్రధాని పర్యటనకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు.