గుంటూరు జిల్లాలో మేజర్ పంచాయతీ పెదకూరపాడు ఓటర్ల జాబితాలో అనేక తప్పులు చోటు చేసుకున్నట్లు విమర్శలు వస్తున్నాయి. మృతి చెందిన వారి పేర్లు రావడం.. కొన్ని వార్డుల్లో ఒక్కొక్కరికి రెండు, మూడు ఓట్లు రావడం.. తదితర తప్పులు ఉన్నాయి. కొంతమంది సామాజిక వర్గాలు తప్పుగా నమోదయ్యాయి. ఫొటోలు సరిగా లేకపోవడం, చిరునామా, వయసులో వ్యత్యాసం వంటి అనేక తప్పులు ఉన్నాయి. పదేళ్ల కింద మృతి చెందిన వారి వివరాలూ జాబితాలో ఉండటం గమనార్హం. దీంతో ఓటర్లు గందరగోళానికి గురవుతున్నారు.
చనిపోయిన వారికీ ఓటు హక్కు..!
గుంటూరు జిల్లా పెదకూరపాడు గ్రామంలో చనిపోయిన వారి పేర్లనూ అధికారులు ఓటరు జాబితాల నుంచి తొలగించక పోవడం పలు విమర్శలకు తావిస్తోంది. 14వ వార్డులో 335 మంది ఓటర్లలో 35 మంది మృతులు, ఆరు డబుల్ ఎంట్రీలు ఉండటంతో జాబితా తప్పుల తడకగా మారింది.
mistakes in voter lists in guntur district pedkurapadu
ఈ విషయమై పెదకూరపాడు ఎంపీడీవో ఎస్. రాజేశ్‌ను వివరణ కోరగా జాబితాలో మృతుల వివరాలు, డబుల్ ఎంట్రీలు ఉన్న మాట వాస్తవమేనని తెలిపారు. ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో పంచాయతీ కార్యదర్శి బీఎల్ఓలు వాటిని సరి చేసి జాబితాను ప్రిసైడింగ్ అధికారులకు అందజేస్తారని చెప్పారు.
ఇదీ చదవండి: పల్లె పోరు: కొనసాగుతున్న ఉద్రిక్తతలు..ఓ వర్గం అభ్యర్థులను బెదిరిస్తున్న ప్రత్యర్థి వర్గం