ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రంలో 2 ప్రాంతాల్లో తప్పిన రైలు ప్రమాదాలు

రాష్ట్రంలో రెండు వేర్వేరు చోట్ల రైలు ప్రమాదాలు తప్పాయి. గంటూరు జిల్లా శావల్యపురం - వినుకొండ మధ్య రైలు పట్టా విరిగిపోగా.. కాకినాడ సమీపంలో రైలు నుంచి బోగిలు విడిపోయాయి. అప్రమత్తమైన రైల్వే అధికారులు వెంటనే మరమ్మతులు చేశారు.

రెండు వేర్వేరు చోట్ల తప్పిన రైలు ప్రమాదాలు
రెండు వేర్వేరు చోట్ల తప్పిన రైలు ప్రమాదాలు

By

Published : Feb 22, 2020, 12:32 PM IST

రెండు వేర్వేరు చోట్ల తప్పిన రైలు ప్రమాదాలు

గుంటూరు జిల్లా శావల్యపురం - వినుకొండ మధ్య ఉన్న రైలు మార్గంలో పట్టా విరగిపోయింది. ఫలితంగా.. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. గంటన్నరపాటు రైళ్లు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విషయం తెలుసుకున్న రైల్వే సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మరమ్మతులు చేసి.. రాకపోకలు పునరుద్ధరించారు.

తప్పిన ప్రమాదం

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పోర్టు నుంచి సాయి నగర్ వెళ్లే కాకినాడ ఎక్స్ ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. విజయవాడ సింగ్ నగర్ సమీపంలోకి రాగానే బోగిల నుంచి విడిపోయిన రైలు కొంత దూరం వెళ్లింది. ప్రమాదాన్ని గుర్తించిన రైల్వే అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకొని.. మరమ్మతులు చేశారు.

ఇదీ చదవండి:

అలిగిన పాలకమండలి సభ్యులు... ఆలస్యమైన లింగోద్భవ కార్యక్రమం

ABOUT THE AUTHOR

...view details