మానసిక వ్యాధితో బాధపడుతూ ఇంటి నుంచి ఆరేళ్ల క్రితం వెళ్లిపోయిన ఓ వ్యక్తిని గుంటూరు జిల్లా న్యాయ సేవా అధికారులు కుటుంబ సభ్యుల చెంతకు చేర్చారు. జిల్లా న్యాయమూర్తి గోపీచంద్ సమక్షంలో కుటుంబ సభ్యులకు అతన్ని సోమవారం అప్పగించారు.
గుంటూరులోని గోరంట్లకు చెందిన శివనాగరాజు ఆరేళ్ల క్రితం ఇంటి నుంచి మధ్యప్రదేశ్లోని బిలాస్పూర్ వెళ్లిపోయాడు. మానసిక పరిస్థితి సరిగ్గా లేని ఆయనను.. అక్కడ పోలీసులు మానసిక వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. చికిత్స తర్వాత అతను తన చిరునామ చెప్పటంతో అక్కడి అధికారులు గుంటూరు న్యాయ సేవా అధికారులకు సమాచారం అందించారు. న్యాయ సేవా అధికారులు... శివనాగరాజు కుటుంబ సభ్యులకు విషయాన్ని తెలియజేశారు. ఎప్పుడో ఆరేళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన నాగరాజు తిరిగి రావటంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. జిల్లా న్యాయ సేవా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.